Home

                       aumv.kutumba Rao  Duty is God.Work is worship.Dedication is Devotion.Satisfaction is salvation

భగవంతుడిని మనము కొరవలసిన 3 మాత్రమే.
1) నాకు సద్బుద్దిని ప్రసాదించు.
2) నకేదికావాలో అది ఇవ్వు.
3) నా కష్టాలను తొలగించు.

                         My f b id –  https://www.facebook.com/vkutumbarao                                                                
                                                          http://www.english-at-home.com/    6Please note – In Bhagavat geeta there are 700 slokas.                 

దయచేసి ప్రతి తల్లిదండ్రులు చదవండి……………హాలిడేస్ లో పిల్లలకు సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి……….ప్లీజ్……….

1.దగ్గరలోని బ్యాంకుకు తీసుకుని వెళ్ళండి….అవి ఎలా పనిచేస్తున్నాయో……..
ఏ.టి.యం. ఎలా పనిచేస్తుందో……….వాటివలన లాభాలేంటో చెప్పండి.

2.వీలు చూసుకుని అనాద శరణాలయాలకు,వృద్ధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.

వారి బాధలను,కష్టాలను వారికి అర్థం అయ్యేలా చెప్పండి……..

3.నదుల దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి………తప్పక వారికి
ఈతను నేర్పండి……….

4.రెండు చెట్లను వారికి ఇచ్చి వారిని చక్కగా పెంచమని చెప్పండి….చక్కగా
పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తానని వారిని ప్రోత్సాహించండి………

5.మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.రక్తం యొక్క ఆవశ్యకతను వారికి
తెలియచేయండి…….నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్థించండి…

6.Govt.hospitals కు తీసుకుని వెళ్ళండి………రోగులు పడే పాట్లను……
ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి…….

7.సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి ,తాతయ్య,అమ్మమ్మ,బామ్మల ,అత్తల,మామల
బాబాయ్ ల , ఆప్యాయతలని వారికి రుచి చూపించండి………అందరూ
కలసి మెలసి వుంటే ఎంత బా్గుంటుందో చూపండి…….వ్యవసాయం
అంటే ఏమిటి? రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో,పదార్థాలను వృద్ధా
చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి……

8.దగ్గరలోని,పోలీసు స్టేషను,కోర్టు,జైలుకు తీసుకును వెళ్ళండి.,జైలు లోని శిక్షలు,వీటిని
గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి
వీలు ఉంటుంది……..

9.దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని ……వారు కోరినవన్నీ
కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి……వారికోసమే మీరు
ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి…………

10. గ్రంధాలయాలను సందర్శించే అలవాటు చెయ్యండి.

11. మతాలకు దూరంగా మానవవాదాన్ని , పరిశీలనా తత్వాన్ని, సంస్కరణాభిలాష ను పెంపొందించండి.

12. రాజ్యాంగ విలువలు నేర్పండి.

Notice Board

Please Download this book entitled “Upakari’s Ultimate English “. This book Fourth book on spoken English is useful for all K.G to P.G students with Telugu explanation from basics.

https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKdWV1X2Fta3YwR2s/view?usp=sharing

    A FREE SITE ON SPOKEN ENGLISH    –    http://www.english-at-home.com/

 

                                                            10 DVDs 

I  prepared 18 hours Spoken English video lessons  and many e books.They are  in 10 DVD format and  available at nominal  price  for Rs 400/-  only. 10 DVDs available place –
 1)  Keerthi Digitals ,S R T  328,  Ashok Nagar, Beside Classic Ice creams, Near RTC X Roads, Hyderabad,A.P ,India contact – 9248635350
 * 10 Dvds Rs 400/-

                                                 English through pictures

https://drive.google.com/file/d/0B03ENoeHjCBMTnE5WEhpb1VVQW8/view?usp=sharing

                                                      English through stories

 https://drive.google.com/file/d/0B03ENoeHjCBMVnFPZEFNUHZ5X2s/view?usp=sharing

—————————————————————————————————————————-

68 సంవత్సరాల స్వతంత్ర్య జీవనంలో ఎవరు మారారు ?…..కాలం , విజ్ఞానం, వాతావరణం, పరిస్దితులు, ఆలోచనా విధానం, అవసరం, మంచి, మానవత్వం, నీతి, నిజాయితీ, గతి, స్ధితి, గమనం, గమ్యం….. రాజకీయం, ఏలికలు , పాలకుల పనితనం……ఇలా ఒకటేమిటి అన్ని మారాయి…………
.
కాని పేదవాడు మాత్రం అలానే ఉన్నాడు…….మనలో అందరికి స్వాతంత్ర్యం రాలేదు…..కేవలం కొందరికే వచ్చింది………….స్వాతంత్ర్యం వచ్చి పట్టుమని 50 ఏళ్ల కూడా నిండని అతి చిన్న దేశాలు ప్రపంచాన్ని శాసిస్తుంటే……..చవట దద్దమ్మల్లా ఇంకా పొరుగు వాళ్ల కాళ్ల దగ్గర దేహి అని అడుక్కోవాల్సిన దుస్ధితి ఇంకా ఉందంటే …….మనకి స్వాతంత్ర్యం వచ్చినట్టా………..మనకి మనం స్వేచ్చగా బ్రతకడమేనా స్వాతంత్ర్యమంటే..?…….

ఇంకా భారత్ లో 32% ఇళ్లకి కరెంట్ లేదు…. , 39% మందికి సొంత ఇల్లు లేదు…..47% మంది మూడు పూటలా అన్నం దొరకడం లేదు….ఇలా ఒకటేమిటి అన్నిటిలో దేశానికి ఒకవైపు మాత్రమే చూపిస్తూ అభివృద్ది అంటున్నారు……మరో కోణం ఎందుకు చూపడం లేదు….. ( 2% ప్రజలు మాత్రమే ఉపయోగించే ఎయిర్ పోర్ట్ ల అంతర్జాతీయ స్ధాయిలో అభివృద్ది, నిర్మాణాలు దృష్టి పెడుతున్న ఏలికలారా…కనీసం సైకిల్ కూడా లేని 23% ప్రజలపై ఎందుకు దృష్టి సారించరు.)……………….
…………… …….దేశమా ఉలికిపడూ….

                                     🙏 ధర్మ సందేహాలు 🙏

🔴 పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?

🔵 పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.

🔴 పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?

🔵 ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.

🔴 పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?
🔵 ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,
🔵 ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.

🔴 ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?
🔵 ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.

🔴 తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?

🔵 తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.

🔴 తీర్థ మంత్రం: 🔵 అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం
సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .
🔴 స్నానము ఎలా చేయ వలెను?

🔵 నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను.
స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును.
సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.(అవి పూడి పోకుండా ఉండటానికి)

🔴 ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?

🔵 గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది.
రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.

🔴 పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?

🔵 తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.

🔴 ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?

🔵 సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల.రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు )

🔴 హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?

🔵 కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు
విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.
ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.

🔴 ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?

🔵 మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.

🔴 పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?

🔵 పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు.అందులో దిగంబర ఋషులు ఉండటంతో
సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి,
జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.

🔴 మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?

🔵 వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. భదిరినాత్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును
పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల,ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని
మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అధ్బుతాన్ని మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. ఆ ప్రదేశాన్ని దాటగానే మల్లి గలగలలు.

🔴 శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు?

🔵 సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి
పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.

🔴 అయిదో తనమంటే ?

🔵 ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.

🔴 స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకున్డరాదు?

🔵 ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీమీద కామం కలుగుతుంది. తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతే లక్ష్మిదేవి అక్కకు కూడా ఆహ్వానమే.!

చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే …. కారణాలు – పరిష్కారం * బాధించే చుండ్రు.. * నిగనిగలాడే జుట్టు కోసం…

చుండ్రుతో బాధా..?!
టీవీలో యాడ్‌… దువ్వుకుంటుంటే పొట్టులా రాలి బ్లాక్‌ కోట్‌ మీద తెల్లగా పొడి రాలుతూ ఉంటుంది.తలలో విపరీతమైన దురదా? అయితే చుండ్రే కారణం అంటూ మోడల్‌ ఓ షాంపూను చేతిలో పెడుతుంది. ఇది నిత్యం మనం టీవీల్లో చూసేవి. కానీ కేవలం షాంపూలు వాడితేనే తగ్గిపోయే సమస్య కాదు ఇది. ఈ చుండ్రు అనేది ఆడ, మగ భేదం లేకుండా బాధించే సమస్యలలో ఒకటి. కాకపోతే ఎక్కువ శాతం ఈ చుండ్రుతో బాధపడేవారి సంఖ్య పురుషుల కన్నా స్ర్తీలలోనే ఉంటుంది.అసలు చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే కారణాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి… వాటికి పరిష్కారం ఏంటీ అంటే…

aloe-showerసరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకపోవ డం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌…లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. అయి తే చాలా మంది చుండ్రు నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. అలాంటి వైద్యం కన్నా మనమే సొంతంగా ఇంటి వద్దే చుండ్రు నివారణ మందును తయారు చేసుకొని వాడవచ్చు.

పొట్లకాయరసంతో :

సహజసిద్ధంగా చుండ్రు నివారణ మందును ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు ను. మార్కెట్లో దొరికే పొట్లకాయను ఒకటి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి జ్యూస్‌ మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొట్లకాయరసంలో వేరే ఏదీ కలపకుండా దానిని వడగట్టి ఆపళంగా తలంతా వెంట్రు కల మొదళ్ల నుంచి చివరిదాకా పట్టించా లి. అవసరం అనుకుంటే మరో పొట్లకా యను జ్యూస్‌ చేసుకుని మొత్తాన్ని వాడాలి.ఇరవై నిమిషాలపాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన క్రమంగా చుం డ్రు మటుమాయం అవుతుంది. చుండ్రు నివారణకు పొట్లకాయ రసం బాగా పనిచేస్తుంది.పైగా వెం ట్రుకలు నిగనిగలాడేలా చేయడం లోనూ పొట్లకాయ రసం బాగా ఉపకరిస్తుంది.

శనగపిండి:
శనగపిండి నాల్గు స్పూన్లు తీసుకుని ఒక కప్పు పెరుగులో ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కల పాలి. మెత్తగా పేస్ట్‌ మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత పల్చ గా వచ్చిన పిండిని వెంట్రుకల మొదళ్లనుంచి చివళ్ల దాకా వచ్చేలా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయా లి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.

నిమ్మ, జామరసం మిశ్రమంతో:
నిమ్మకాయరసంలో జామ ఆకుల రసాన్ని మేళవించి రెండూ కలి పి వెంట్రుకల లోపల దాకా వేళ్లేట్లుగా పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నా నం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చొప్పున చేస్తుంటే చుండ్రు మటుమాయం అవుతుంది.

హెన్నా :
వెంట్రుకల రంగు మార్చుకోవడానికి హెన్నాను వాడుతుంటారు. అయితే మార్కెట్లో మంచి బ్రాండ్‌ హెన్నాను వాడితే చాలా మంచిది. హెన్నా చుండ్రును అరికట్టడంలో దివ్యంగా పనిచేస్తుంది.

మెంతులు, పెరుగు పేస్ట్‌ :
మెంతులు ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి గుజ్జులా చేసుకుని వెంట్రుకలకు పట్టించాలి. మెంతులు చుండ్రు నివారణలో దివ్యంగా పని చేస్తాయి.

గోరింటాకు :
గోరింటాకు కోసుకురాగానే ఆ ఆకుల రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది.అందులోకి ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కలుపుకుంటే మరింత అనుకూలమైన ఫలితం వస్తుంది.

వెనిగర్‌ :
మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్‌ బాటిల్‌ను తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్‌ చొప్పున కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది.

ఉసిరికపొడి :
పెద్ద ఉసిరికాయలను తెచ్చి నూరి వాటిని ఎండబెట్టి ఆ తర్వాత పొడిచేసుకోవాలి. లేకపోయినా ఉసిరిక పొడి అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరిక పొడిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత ఎవరిచేతనైనా తల మాలిష్‌ చేయించుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కొన్నాళ్లలో తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.

పోషకాహారం :
ఇవన్నీ ఒక ఎత్తయితే… మనం తీసుకునే పోషకపదార్ధాలు ఒక ఎత్తు. ఎక్కువగా ఏ కాలంలో వచ్చే పండును ఆ కాలంలో తప్పక తీసుకోవాలి. చుండ్రు నివారణలో మనం తీసుకునే పండ్లు, వాటి రసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. చుండ్రు ఉన్నవాళ్లు ఎక్కువగా సిట్రస్‌ పండ్లు తీసుకోకపోవడమే మంచిది. అలాగే చుండ్రు తగ్గేదాకా అరటిపండును కూడా తినవద్దు. ఎక్కువ ఆయిలీ పదార్థాలు, పిజ్జాలు, బర్గర్ల వంటివి తగ్గించాలి.

http://ad.bharatstudent.com/st?ad_type=iframe&ad_size=468×60&section=593511

 

బాధించే చుండ్రు.. 
అందాన్ని రెట్టింపు చేసే శిరోజాలు అస్తమానం ఊడిపోతుంటే, మీ అందం అడవి కాచిన వెన్నెల అవుతుంది కదూ! దానికి కారణం చండ్రు. తలలో దురద పెట్టి చికాకు పెట్టడం కారణం కావడమే కాకుండా మాటిమాటికీ తలలో చెయ్యి పెట్టడం చూసే వారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దీని కారణంగా చేసే పనిలో ఏకాగ్రత కూడా తగ్గుతుంది.చుండ్రు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్‌, చర్మతత్త్వాలుఅంతర్గతంగా ప్రధానపాత్ర వహించే కారణాలు.

dandruff 
వెంటనే తొలగించాలి...
చుండ్రువల్ల జుట్టు బాగా రాలిపోతుంది. బాగా దురద పెడుతుంది. ముఖం, వీపు, మెడలపై పడి చికాకు పుట్టిస్తుంది. ముఖం పై మొటిమలు కావడం, తలనొప్పికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుం ది. చుండ్రుతో పాటు మొఖం పై అవాంఛిత రోమాలు, స్థూలకా యం, రుతుక్రమంలో తేడాలు కనిపిస్తే పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ సిం డ్రోమ్‌ ఉందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాలి. చండ్రుతో తరుచు ఇబ్బంది పడేవారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీ డాండ్రఫ్‌ షాంపూ వాడకాన్ని ఆపేస్తారు. కానీ ఇలా చేయకూడదు.

చుండ్రు నివారణకు…
చుండ్రు తొలగించడానికి పార్లర్లకు వెళ్ళి చికిత్స తీసుకో అవసరం లేదు. ఇంట్లోనే పాటించే అనేక చిట్కాలవల్ల చుండ్రు తగ్గే అవకాశం ఉంది.
– అరకప్పు పెరుగులో రెండు టేబుల్‌ స్పూన్ల పెసరపిండి కలిపి జుట్టుకు పట్టించాలి. ఆరగంటాగి కడిగేయాలి. ఈ విధంగా వారానికోసారి చేస్తుండాలి.
– ఒక టీ స్పూన్‌ నిమ్మపండు రసంలో రెండు టీ స్పూన్‌ల వెనిగర్‌ని కలపాలి, దానితో తలని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
-వెనిగర్‌ రెండు టేబుల్‌స్పూన్లు మాడుకు పట్టించి అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. తేలిగ్గా తలను మసాజ్‌ చేసుకుని కడిగేయాలి.
– మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయాలి. తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకోండి. మసాజ్‌ అయ్యాక ఓ అరగంట తరువాత షవర్‌ బాత్‌ చేస్తే చుండ్రు ఉండదు.
-ఒక మగ్గు నీటిలో ఒక టీ స్పూన్‌ తాజా నిమ్మరసం కలిపి తలస్నా నం అయ్యాక ఈ నీటితో జుట్టు కడుక్కోవాలి. దీనివల్ల చుండ్రు తాలూకు పొట్టు రేగడం తగ్గిపోవడమే కాకుండా జుట్టుకు మెరుపు చేకూరుతుంది.
– సెలీనియా, సలె్ఫైడ్‌ లేదా స్యాలి సిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాం పులను వాడాలి.ఇవి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.
– మలస్సేజియా గ్లోబస్తా అనే ఫం గస్‌ తాలూకు జన్యువు 50,90 శా తంమందికి చర్మంపై పెరుగుతుంది. ఈ జన్యువు చుండ్రు, ఇతర చర్మసంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. వీటిలో సహజీవనం సా గించే కొన్ని జన్యువులు కూడా ఉండ డం వల్ల మలస్సేజియాసెక్స్‌కు అనుకూలంగా ఉంటుందని, దీని వల్ల వీటి విస్తరణకు అవకాశం అధికం గా ఉంటుందని నిపుణులు అం టున్నారు. దీనిని అరికట్టేం దుకు యాంటీ డాండ్రఫ్‌ షాంపూలు ఉపకరిస్తాయి.
-ప్రపంచలో 90 శాతం మంది ప్రజల్ని చుండ్రు బాధిస్తున్నదని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం వారు పది లీటర్ల ఫంగస్‌ను వృద్ధి చేశారు. ఇది కోటిమంది ప్రజల తలపై ఉండే ఫంగస్‌కు సమమైంది.

నిగనిగలాడే జుట్టు కోసం…
హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు సొంతం అవుతుంది.
 
 

1 2 3

 

45నెల్లూరు లో 80 సంవత్సరాల వయస్సు కలిగిన కమలా మేడం అని ఒకరు ఉన్నారు.ఈవిడ కొంతమంది సహయం చేయడం వలన ప్రభుత్వ ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాలల్లో చదివే విధ్యార్ధులకోసము స్పోకెన్ ఇంగ్లిష్ పైన మొత్తము కలిపి 32 పుస్తకాలను వ్రాసినది .26 పుస్తకాలు ప్రాధమిక పాఠశాల విధ్యార్ధులకు మిగతావి (6)ఉన్నత పాఠశాల విధ్యార్ధులకు.వీటినన్నింటిని దాదాపు నెల్లూరు జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధులకు ఉచితంగా పంపిణీ చేసినది. ఈమె ఆశయము మన ఆంధ్ర  మరియు తెలంగాణ రాస్ట్రాలలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధులకు ఈ పుస్తకాలు చేరాలని. ఈ నెల 2 వ తేదీన వీరు అమెరికా వెళ్ళారు.మరల జూన్ లో వస్తామన్నరు ఆరొగ్యం బాగుంటే.ప్రస్తుతము కాళ్ళ నొప్పులతో వీరు బాధ పడుతున్నారు.వీరు వచ్హినా లేక రావడానికి వీలు కాలేక పొయినా వీరి సంకల్పం ,ఆశయం ఆగిపోకూడదు. అందుకనే నేను ఏదో ఉడతా సాయంగా నాకు చేతనైనట్లుగా వీటిని నా కెమెరాతో స్చ్కాన్ చెసి ఇక్కడ ఇస్తున్నాను .ప్రస్తుతము ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధులకు కావలసిన 26 పుస్తకాలను ఇక్కడ ఇచ్హాను.2 రోజుల్లో ఉన్నత పాఠశాలకు కావలసిన వాటిని ఇస్తాను. 

కాబట్టి మన 2 తెలుగు రాస్ట్రాలలొపని చేసే ప్రభుత్వ ప్రాధమిక  మరియు ఉన్నత పాఠశాల ఆంగ్ల అద్యాపకులు తప్పక ఈ పుస్తకలను డౌన్లోడ్ చెసుకుని ఒక పుస్తకముగా బైండింగ్ చేసుకుని ఈ వేసవి సెలవులలో తాము మొదటగా చదివి ఆ తరువాత రాబోయే జూన్ లో పాఠశాలలు తిరిగి తెరిసెసమయనికల్లా ఇంగ్లిష్ పాఠాలను పిల్లలకు చెప్పమని నా ప్రార్ధన. 

ఈక్కడ ఇవ్వబడిన ఇంగ్లిష్ పుస్తకాలను ఒక బైండింగ్ బుక్ గా చేసి మీరుచదివిన ప్రభుత్వ పాఠశాల లోని ప్రధానోపాధ్యాయునికి ఇవ్వండి.లేదా మీ ఊరిలోని ప్రభుత్వ పాఠశాలకు ఒక బహుమతిగా ఇవ్వండి.తద్వారా ఆ స్కూల్ లోని విధ్యార్ధులందరూ మీ వలన చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతారు.ఒక స్కూల్ కి ఒక పుస్తకము చొప్పున చేరగలిగితే చాలు.విద్యాదానము మహాదానము. గుర్తుంచుకోండి.

For Government Primary school          students

Kamala Madam – 1
Kamala Madam – 2
Kamala Madam – 3
Kamala Madam – 4

For Government High School students

Dictionary 

Conversations

Read English ( Part -1 )

Read English ( Part – 2)

30 stories ( Part – 1)

30 Stories ( Part – 2 )

———————————————————————————-

                        కర్మ సిద్దాంతం అంటే…

https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKUklKX2RKWXg2Slk/view?usp=sharing

                         by Viswanatha Kutumba Rao

—————————————————————————————

1       My voluntary organization –  https://upakarisevasamstha.wordpress.com/ 

—————————————————————————————-

Please note – First download these 2 files. And then Select the  both zip files and
click on ” extract here” on desk top to get one Mp3 audio.(It is a 157 Mb audio file(Mp3))

Learn to speak English – part -1

Learn to speak English – part – 2

                 blogs
2.
 ఇంష్ ఉచ్హారణ(English Pronunciation) ( This is very important blog on different accents )
3.My google site on Spoken English ( English basics ) 
16. passipe
**********************************************************************     
1) My First English  book on Grammar
4) advanced Spoken English lessons , download and get printouts . It is enough for you.
5) A few English sentences
6) Grammar made easy

https://docs.google.com/open?id=0B7EuL-4ojOaKY3gxUzZQdHIxLWM

7) English grammar with Telugu explanation from basics

https://docs.google.com/open?id=0B7EuL-4ojOa

8) Interview questions

ENGLISH BOOKS
Please get printouts of these pages and learn daily as many pages as you can.
15) English Style writing
16) Penneru Telugu Magazine
19) Spoken English @ different stages 
20) Essential communication tips
21) Learning English online

29) Spoken English sentences with pictures   –  http://upakarieng.blogspot.in/

                           

              ************************************************

 Cinema &  Entertainment sites
—————————————————————

  Listen to all 6 FM Radio Stations of Hyderabad online

                    Teluguone Radio – Australia    Teluguone Radio – UK (GMT)

WEBSITE

E-PAPER

 
 
                                            — English News Papers —
Hindu logo                                  
indian express logod-c                          —  American English News Papers  —
w post logowashington timesnew york times

Continue reading