Home

IMG_20200115_085230.jpgMy video about Makara Samkranti festival.

పురాణ ప్రకారంగా సంక్రాంతికి గల ప్రాముఖ్యత గురించి 4 మాటలు?
దేవతలకు – మానవులకు మద్య సమయ వ్యత్యాసం ….

1. శ్రీ మహా విష్ణువు అసుర సంహారం గావించి మంధర పర్వతం కింద వారి తలలు ఖననం చేసి అసుర జాతి మొత్తాన్ని అంతం చేసిన రోజు ఇది.

2. ఐతిహాసికముగా సూర్య భగవానుడు తన పుత్రుడయిన శని మహాత్ముడి (మకర రాశి అధిపతి) ఇంటికి స్వయంగా వెళ్ళి ప్రపంచానికి తండ్రి కుమారుల అనుబంధాన్ని చాటి చెప్పిన రోజు ఇది. మమూలుగా వీరు ఇరువురికి అంతగా పొసగదు.

3. ఈ రొజునే భగీరతుడు తన దురదృష్టకరమైన పూర్వీకులకు గంగానదీజలముతో తర్పనం వదిలాడు మరియు తద్వారా వారికి శాపం నుండి విముక్తి ఈ రోజున కలిగింది. నేటికి కూడా చాలా పెద్ద గంగా సాగర్ మేళా గంగా నది బంగాళాఖాతం సంగమం వద్ద ఈ రోజు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

4. మహా భారత యుద్దము నందు అంపశయ్య కు పరిమితమయిన భీష్ముడు తనకు వర ప్రసాదితమైన “సంకల్ప మృత్యువు”ను ఆహ్వనించి తనువు చాలించినది ఈ రొజే.

ఇంకను ఉత్తరాయనము దేవతల పగలని దక్షిణాయనము రాత్రి అనియు పురాణ ప్రతీతి. సంక్రాంతికి ఈ మార్పు జరుగుతుంది. అందువలననే ఈ పర్వ దినము అతి శ్రేష్టమైనది

ఉత్తరాయణ_పుణ్యకాలం

‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. ‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు. దక్షిణాయణం రాత్రి.

‘సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం.సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి.

జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం ‘సంక్రాంతి’ని ఇలా నిర్వచించింది.
‘‘తత్ర మేషాదిషు ద్వాదశ
రాశి క్రమణేషు సంచరితః
సూర్యస్య పూర్వన్మాద్రాశే
ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః’’

మకర సంక్రమణానికెంతో ప్రాముఖ్యత ఉందని పురాణేతిహాసాల్లో కానవస్తోంది.
‘‘రవి సంక్రమణే ప్రాపే న
న్నా యాద్యన్తు మానవః
సప్త జన్మసు రోగీ స్యా
నిర్దేనశే్చన జాయతే’’

అని స్కాంద పురాణం చెబుతోంది. అంటే, రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.

పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈ రోజునేతన కుమారుడైన శని ఇంటికి వెళతాడు.ఆయనం అనగా పయనించడం అని అర్థం. ఉత్తర ఆయనం అంటే ఉత్తరవైపు పయనించడం అని అర్థం. సూర్యుడు భూమికి కొంత కాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపు పయనించనారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కునుబట్టి, దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అనీ, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు.

ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయణం పాప కాలం అని అర్ధం చేసుకోకూడదు. దక్షిణాయణం కూడా పుణ్య కాలమే.. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు…

ఉత్తరాయణం లో లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు.. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరం గా వుండడం వలన పుణ్య క్షేత్రాలు, తీర్ధ యాత్రలకు అనువుగా వుంటుంది…. మనం ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రం గా భావించడం వల్లనూ వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్లనూ, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లనూ, సమస్త భాషలకూ తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లనూ, సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లనూ, ముఖ్యం గా; ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పధ చలనం చేయడం వల్లనూ, ఉత్తరాయణ కాలం ను పుణ్య కాలం గా హిందువులు భావించారు.

సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనేతీరుస్తారని, ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు.

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గ వాసం కలుగుతుందని ఆస్తిక లోక విశ్వాసం.

కల్పము (కాలమానం)
కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు. ఇది 432 కోట్ల సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలుంటాయి. మన్వంతరాన్నే మనుయుగమని కూడా అంటారు. మన్వంతరానికి 31,10,40,000 సంవత్సరాలు. ఒక్కో మన్వంతరంలో భూమిని ఒక్కో మనువు పాలిస్తాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏడవ మన్వంతరం. పాలిస్తున్నది వైవస్వత మనువు. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. ఒక్కో మన్వంతరంలో 71 మహాయుగాలు, ఒక్కో మహాయుగంలో నాలుగు యుగాలు (కృత, త్రేతా, ద్వాపర మరియు కలి యుగాలు) ఉంటాయి.

దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము
= బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000
కల్పముల పేర్లు
మహాభారతంలో చెప్పిన ప్రకారం ప్రస్తుతం బ్రహ్మకు 51వ సంవత్సరంలో “శ్వేతవరాహ కల్పం” నడుస్తున్నది. మత్స్య పురాణం (290.3-12)లో 30 కల్పాల పేర్లు చెప్పబడ్డాయి. అవి

శ్వేత కల్పము
నీలలోహిత కల్పము
వామదేవ కల్పము
రత్నాంతర కల్పము
రౌరవ కల్పము
దేవ కల్పము
బృహత్ కల్పము
కందర్ప కల్పము
సద్యః కల్పము
ఈశాన కల్పము
తమో కల్పము
సారస్వత కల్పము
ఉదాన కల్పము
గరుడ కల్పము
కౌర కల్పము
నారసింహ కల్పము
సమాన కల్పము
ఆగ్నేయ కల్పము
సోమ కల్పము
మానవ కల్పము
తత్పుమాన కల్పము
వైకుంఠ కల్పము
లక్ష్మీ కల్పము
సావిత్రీ కల్పము
అఘోర కల్పము
వరాహ కల్పము
వైరాజ కల్పము
గౌరీ కల్పము
మహేశ్వర కల్పము
పితృ కల్పము
వాయు పురాణం 21వ అధ్యాయంలో 28 కల్పాల పేర్లున్నాయి. తరువాతి అధ్యాయంలో మరో ఐదు కల్పాలపేర్లున్నాయి.చతుర్యుగాలు
హిందూ సంప్రదాయముననుసరించి కొన్ని సంవత్సరములు కలిపి ఒక యుగము గా కాలమానము లెక్కింపబడుతున్నది. అలా నాలుగు యుగాలు చెప్పబడ్డాయి.
1 యుగాలు, మహా యుగము
2 యుగాదులు
3 యుగాల మధ్య జరిగిన ఒక కథ
యుగాలు, మహా యుగము
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాలానికి సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును
కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు (ఇందులో 5,106 సంవత్సరాలు జరిగినది)
మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు – ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుందనీ, త్రేతాయుగంలో మూడు పాదాలపైన, ద్వాపర యుగంలో రెండు పాదాలపైన, కలియుగంలో ఒక పాదంపైన నడుస్తుందని చెబుతారు.
యుగాదులు
కృత యుగాది – కార్తీక శుద్ధ నవమి
త్రేతా యుగాది – వైశాఖ శుద్ధ తదియ
ద్వాపర యుగాది – మాఘ బహుళ అమావాస్య

యుగాల మధ్య జరిగిన ఒక కథ
భాగవతం ఏకాదశ స్కందము నుండి : ఇప్పటి మన్వంతరము ఆరంభములో, అనగా స్వాయంభువు మన్వంతరములోని మొదటి మహాయుగంలోని సత్యయుగం మధ్యకాలంలో – సూర్యవంశపు రాజు కకుద్ముని కుమార్తె రేవతి అనే సుందరి. ఆయన తన జ్యోతిష్కుల మాటలు నమ్మలేక, తన కుమార్తెకు తగిన వరుని గురించి అడగడానికి, తన కుమార్తెతో కలసి బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అక్కడ బ్రహ్మ దర్శనం కోసం ఆయన షుమారు 20 నిముషాలు (అప్పటి కాలమానం ప్రకారం) వేచి ఉండవలసి వచ్చింది. దర్శనం తరువాత కకుద్ముడు తన సందేహాన్ని చెప్పగా బ్రహ్మ నవ్వి, “నీవు వచ్చిన తరువాత 27 మహాయుగాలు గడచిపోయాయి. కనుక నీవు మనసులో ఉంచుకొన్న వరులెవ్వరూ ఇప్పుడు జీవించి లేరు. ప్రస్తుతం భూలోక వాసులు శ్రీకృష్ణభగవానుని అవతారంతో పునీతులౌతున్నారు. నీవు తిరిగి భూలోకానికి వెళ్ళి నీ కూతురుకు కృష్ణుని అన్న బలరామునితో వివాహం జరిపించు అని చెప్పాడు. అతడు అలాగే తెరిగి వెళ్ళి తన కుమార్తె రేవతి ని బలరామునకిచ్చి పెళ్ళి చేసాడు.
(ఒక మహాయుగము = బ్రహ్మకు 43.2 సెకనులు)
సృష్టిని పాలించేది మనువులు. ఒక్కో మనువు 71 మహా యుగాలు పాలిస్తాడు. అలాంటి 14 మనువులు పాలించే కాలం బ్రహ్మకుఒక పగలు. రాత్రి కాలం కూడ అంటె అవుతుంది. ఉదయ కల్పం; క్షయ కల్పం. ఇంత వరకు ఆరు ఉదయ కల్పములు, బ్రంహకు జరిగాయి. ఈ ఆరు ఉదయ కల్పములను పాలించిన మనువులు 1.స్వయంబువు, 2 స్వారీచ, 3. ఉత్తమ, 4. తామన, 5, రైవత 6 చాక్షువ. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వతుడు పాలిస్తున్నాడు. 71 మహా యుగములలో 28 వ మహా యుగములోని కలియుగము నడుస్తున్నది.
బ్రహ్మ:: బ్రహ్మ ఒక్కడు కాదు. బ్రహ్మ ఆయుష్షు 100 సంవత్సరాలు. ఇప్పటివరకు మానవ బ్రహ్మ, చాక్షువ బ్రహ్మ, వాచిక బ్రహ్మ, శ్రావణ బ్రహ్మ, జన్మ బ్రహ్మ, నాసిక జన్మ బ్రహ్మ అండ జన్మ బ్రంహ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు. ప్రస్థుతం విష్ణువు నాభీ కమలంలో పుట్టిన బ్రహ్మ కాలలో 50 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో మొదటి దినం గడుస్తున్నది. బ్రహ్మ సవత్సరం అంటే 360 రోజులు అనగా, 3,091,76,00,00,000 సంవత్సరాలు. 100 సంఅత్సరాలు అంటే 3,09,17,376 కోట్ల సంవత్సరాలు. అలాంటి ఆరుగురి బ్రహ్మల జీవిత కాలం 18,55,04,256 కోట్ల సంవత్సరాలు గడిచి పోయాయి. 7 వ బ్రహ్మ కాలం 2009,62,944,00,000 సంవత్సరాలయితే అందులో 27మహా యుగాలు అనగా11,66,40,000 సంవత్సరాలు గడిచి పోయాయి. 51 వ సంవత్సరంలో 27 మహా యుగాలు గడచి పోగా ఇప్పుడు 28 వ మహా యుగం లో కృత, త్రేత, ద్వాపర యుగాలు అనగా 38,88,000 సంవత్సరాలు గడిచి పోయాయి. కనుక పంచాంగ కర్థల అంచనా ప్రకారం సృష్టి వయస్సు 200,96,29,56 కోట్ల 5 లక్షల, 33 వేల ఒక వంద సంవత్సరాలు.

అర్హత ఉందో-లేదో అసలేనేనెరుగను
అర్చన అవునో-కాదో అదికూడా నేనెరుగను

నమక-చమక అంతర్గత గమకము నేనెరుగను
కోట్ల అపచారములో షోడశోపచారములో

అహంకార గద్యమో అపురూప నైవేద్యమో
అశక్తతా కళంకమో భక్తి నిష్కళంకమో

దు:ఖ నివృత్తియో ఇదిసత్కృతియో నేనెరుగను
దుష్ట పరిహారమో ఇది ఇష్ట పరిచారమో

కుప్పల తప్పులు చేస్తూ నే ఒప్పులుగా భావిస్తే
గొప్పదైన మనసుతో నా తప్పిదములు క్షమియిస్తూ

సకల దేవతలతో పాటు సముచితాసనుడివై
సన్నిహితుడుగ మారరా లోక సన్నుత ఓ శంకరా

——- My other blogs ——

Spoken English Basics –       https://sites.google.com/site/englishnenglish/

Spoken English accent –      https://sites.google.com/site/englishuchharan/

General Knowledge  –           https://sites.google.com/site/servetou/

personality Development – https://sites.google.com/site/gurukulamu/

 

Namaste,

This is Viswanatha Kutumba Rao, working as a Sanskrit Lecturer for the past 24 years. I trained above 1 lakh students in both English & Sanskrit Via class room and online (Skype/Whatsapp) training.

I have written “Andariki Anglam”, a Spoken English book for 1st to Xth standard, which I am distributing to the poor students of Andra Pradesh & Telangana using the donations of Philanthropists .

a.v-converted-1

7 thoughts on “Home”

Leave a Reply to Shakar Varakala Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s