“మహాభారతం” నుండి
నేర్చుకోవాల్సిన 14 ముఖ్యమైన పాఠాలు
***********************************
1.జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు:
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మలకి పెట్టింది పేరు, కాని సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు, కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి నడుచుకోవాలి.
2.చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు:
శకుని..పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి,వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు,జీవితంలో శకుని లాంటి వారి సలహాలని దూరం పెట్టాలి.
3. ఎటువంటి బేధాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది…
పాండవులు శ్రీ కృష్ణుడిని ,కౌరవులు కర్ణుడిని పొందటం అది వారికి యుద్ధం సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే ,కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటిదో ,కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే కదా, కుల,మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.
4.అధికం అనేది అత్యంత ప్రమాదకరం:
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది, ,రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం, అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు..! కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం.
5. ఎవరి పనులు వారే చేసుకోవడం:
అరణ్య వాసం, అజ్ఞాతవాసంలోఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటిపనులు, వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి, అలాగే మనం కూడా మన అవసరాల కోసం అయినా కొన్ని పనులు నేర్చుకోవాలి.
6.మనకి సంబంధించిన దాని కోసం ఎంత కష్టమైన పోరాడాలి:
కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు
7. అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది:
ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో ,కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు ,అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.
8. విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి:
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు .ద్రోణా చార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం ,దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా ,మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యేకస్థానం దక్కింది, నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
9.కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు:
కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డ వాళ్ళే ,భీష్మ ,విదుర ,ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేసారో తెలిసినదే ,ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతీ అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడు కదా.
10.స్రీలని ఆపదల నుండి కాపాడటం :
నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలూ సంపన్నులూ,అత్యంత బలవంతులు కూడా-కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవటంలో విఫలమయ్యారు కదా.
11. అర్ధ జ్ఞానం అత్యంత ప్రమాదకరం:
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి, అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
12. ఆడది తలుచుకుంటే ఏమైనా చేస్తుంది
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది.
13. నీకు ఆసక్తి ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు:
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలుకాడు ,కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు నేరుగా గురు శిక్షణ లేకున్నా ,అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.
14.మంచి వ్యూహం విజయానికి తప్పనిసరి:
పాండవులకే కనుక కృష్ణుడి అతిచక్కని వ్యూహం లేకపోయి ఉంటే పాండవులు విజయాన్ని సాధించ గలిగే వారు కాదు ఏమో, ఏ పని చెయ్యాలన్న ఒక మంచి ప్రణాళిక(వ్యూహం) ఉండాలి అలా అయితేనే ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.
శ్రీ కాశీక్షేత్ర నామ మహిమ
https://drive.google.com/file/d/0B7EuL-4ojOaKRG1FM01PUGM2R1BjXzllQkU4c2F1T3VULWd3/view?usp=sharing
Audio Files | Flac | Ogg Vorbis | WAVE | 64Kbps MP3 | VBR MP3 |
---|---|---|---|---|---|
Sumati_Satakam(Tel)-Wisdom_Poetry-1 | 54.4 MB | 10.1 MB | 85.6 MB | 7.8 MB | 13.9 MB |
Sumati_Satakam(Tel)-Wisdom_Poetry-2 | 60.9 MB | 11.1 MB | 92.3 MB | 8.4 MB | 15.6 MB |
Sumati_Satakam(Tel)-Wisdom_Poetry-3 | 59.8 MB | 10.7 MB | 91.0 MB | 8.3 MB | 15.5 MB |
Sumati_Satakam(Tel)-Wisdom_Poetry-4 | 30.1 MB | 5.4 MB | 46.8 MB | 4.2 MB | 7.7 MB |
Sumati Satakamu 1-9 padyalu.
Sumati Satakamu 10 – 18 padyalu.
http://www.andhrabulletin.in/AB_Telugu/telugu_padyalu_sumathi1.php
http://prasannk.tripod.com/SumathiSatakalu.pdf
The great Indian personalities
………………… And for more info……………………
http://www.webindia123.com/personal/
http://www.webindia123.com/personal/
http://www.leadthecompetition.in/GK/personalities.html
http://www.famous-india.com/people-in-india/
http://en.wikipedia.org/wiki/List_of_people_from_Andhra_Pradesh
http://www.preservearticles.com/2011121318432/list-of-some-of-the-great-personalities-of-india.html
Thank you sir, my utmost gratitude for the hard work of your team, i am a regular visitor to your
site indeed, i thought to, (out of courtsey) provide some
suggestion and feedback of my very own , would
be thankful if you could reply or acknowledge my recommendations to make this site
more content oriented .
Regards.
Rana Duggal.